24న జిల్లా స్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు
SKLM: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న జిల్లా స్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. KR స్టేడియంలో జూనియర్ అండర్-18 విభాగంలో బాలురు బాలికలకు విడివిడిగా ఎంపికలు జరుగుతాయన్నారు. క్రీడాకారులు https://sports.ap.gov.లో రిజిస్టర్ అవ్వాలన్నారు.