ప్రజలకు ప్రాజెక్ట్ అధికారుల సూచన

NRML: భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడెం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విటల్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా తెరవచ్చన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కడెం ప్రాజెక్టు, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.