'ధురంధర్ 2' ఒకరోజు ముందుగానే
రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ధురంధర్ 2' విడుదలకు సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలోకి రానుంది. అయితే, చిత్ర యూనిట్ ఒకరోజు ముందుగానే, అంటే మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే బుకింగ్స్ షురూ అయ్యాయి. క్రేజీ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.