ఎమ్మెల్యే ఆన్ విల్స్ వాహనం ప్రారంభించిన కవంపల్లి

KNR: మానకొండూరు నియోజకవర్గం ప్రజల సమస్యలు వారి వద్దకే వెళ్లి పరిష్కరించడానికి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంను చేపట్టినట్లు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనంకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వం సేవలందించేందుకు ప్రజల వద్దకే వెళ్లనుందని ఆయన అన్నారు.