MPTC టికెట్ కోసం డిప్యూటీ స్పీకర్‌కు వినతి
MHBD: దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామ ఎంపీటీసీ టికెట్ తన సతీమణి సంపేట లావణ్యకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంపేట సురేష్ గౌడ్ డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపించి బహుమతిగా ఇస్తానన్నారు.