గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా..!
తమిళనాడులో బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు విక్రయిస్తున్నారు. పలువురు కేటుగాళ్లు సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి ఒక్కో సిలిండర్ రూ.8-10 వేలకు అమ్ముతున్నారు. మదురై జిల్లాలో పలుచోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఫిల్లింగ్ స్టేషన్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.