ఘనంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
SKLM: సంతబొమ్మాలి మండలం శ్రీకృష్ణాపురంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఉదయ్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.