TTD ఈవోగా ధర్మారెడ్డి తొలగింపు

నంద్యాల: జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ధర్మారెడ్డిని టీటీడీ ఈవో పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో YCPకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ధర్మా రెడ్డిని ఇటీవలే సీఎస్ నీరభ్ కుమార్ సెలవులపై పంపారు.