ఈనెల 21న కుంభమేళాకు ప్రత్యేక బస్సు
GNTR : ఈనెల 21వ తేదీన మహా కుంభమేళాకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు-2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం తెలిపారు. ఆరోజు ఉదయం 10గంటలకు గుంటూరు బస్టాండ్ నుంచి బయలుదేరి 8 రోజులు యాత్ర పూర్తి చేసుకొని గుంటూరుకు చేరుకుంటుదన్నారు. ఒక్కొక్క టిక్కెట్ ధర రూ.8,300లుగా నిర్ణయించామన్నారు. వివరాలకు 7382897459 సంప్రదించాలని సూచించారు.