మరోసారి వాయిదా పడిన ఆలయ హుండీ లెక్కింపు
ATP: శింగనమల మండలంలోని శివపురం పెద్దమ్మ ఆలయం హుండీ లెక్కింపు మరోసారి వాయిదా పడింది. 8 నెలల హుండీ ఆదాయాన్ని లెక్కించేందుకు దేవదాయ శాఖ అధికారులు నోటీస్ జారీ చేయగా.. పూజారి కుటుంబం అడ్డుకుంది. దీంతో ఆలయం వద్ద రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ఆలయ వివాదం కోర్టులో నడుస్తోందని, 15 రోజుల గడువు కావాలని పూజారి కుటుంబం కోరడంతో అధికారులు హుండీ లెక్కింపును వాయిదా వేశారు.