మోపిదేవి దేవస్థానం దర్శించుకున్న STPI డైరెక్టర్

మోపిదేవి దేవస్థానం దర్శించుకున్న STPI డైరెక్టర్

కృష్ణా: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ STPI డైరెక్టర్ సీ.కవిత గురువారం మోపిదేవి గ్రామంలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు.