'ప్రభుత్వ వైద్యంపై నమ్మకం నిలబెట్టాలి'
KMM: పాల్వంచలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో మంగళవారం కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాత్రను కొనియాడారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.