భారత్ రష్యా చమురు కొనుగోళ్లు ఆపేయాలి: ట్రంప్

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుపట్టారు. గతంలో మాదిరిగానే భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించాలని ట్రంప్ యంత్రాంగం సూచించింది. భారత్ ప్రస్తుతం చైనా, రష్యాతో సన్నిహితంగా పనిచేస్తోందని వైట్‌హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో ఆరోపించారు. కాగా చమురు కొనుగోళ్ల టారీఫ్‌ల ట్రంప్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.