ఓటు వేసిన ఉత్సాహం.. వృద్ధురాలికి సిబ్బంది చేయూత

ఓటు వేసిన ఉత్సాహం.. వృద్ధురాలికి సిబ్బంది చేయూత

SRPT: ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామి అయ్యేందుకు శారీరక అశక్తత అడ్డుకాదని ఓ వృద్ధురాలు నిరూపించారు. హుజూర్‌నగర్ మండలం లింగగిరికి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓ వృద్ధురాలిని ఎన్నికల సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను సిబ్బంది స్వయంగా వీల్ చైర్‌పై పోలింగ్ బూత్ లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించారు.