'నాగబంధం' ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'నాగబంధం'. 1750 కాలం నాటి నేపథ్యంలో దేవాలయ నిధి రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'నామోరే' ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ సాంగ్‌ను ఈనెల 15న ఉ.11:11 గంటలకు విడుదల చేయనున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.