భారీ వర్షానికి కూలిన ఇళ్లు

భారీ వర్షానికి కూలిన ఇళ్లు

WNP: జిల్లాలో భారీ వర్షాల కారణంగా అమరచింత చంద్రనాయక్ తాండాలో హనుమంతు నాయక్, పెద్దమందడి (మ) దొరగుంటపల్లిలో రాజశేఖర్ ఇళ్లు మంగళవారం కూలిపోయాయి. అదృష్టవశాత్తు, ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. తహసీల్దార్ రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితుల వివరాలు తెలుసుకున్నారు. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని బాధితులకు MRO హామీ ఇచ్చారు.