ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగుల ఇక్కట్లు

ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగుల ఇక్కట్లు

WGL: రాయపర్తి మండలంలోని PHCలో ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ అధికారులు ఇక్కడి టెక్నీషియన్‌ను MGMకు డిప్యూటేషన్‌పై పంపించారు. దీంతో మండలంలోని 12 పల్లె దవాఖానాల నుంచి వచ్చే రోగులు రక్తం, మూత్రం పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. వెంటనే కొత్త ల్యాబ్ టెక్నీషియన్ నియమించాలని రోగులు కోరారు.