భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన కలెక్టర్

భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన కలెక్టర్

MDK: మెదక్ నుంచి వెల్దుర్తి మండలానికి వెళ్లే R&B రోడ్ మెదక్ మండలం బాలనగర్ గ్రామ పరిసరాల వద్ద కల్వర్టు కూలిపోయిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుకు మరమ్మత్తు పనులు త్వరితగతిన చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి చేసి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.