'సీలింగ్ ఫ్యాన్ పడి పసి పాపకు గాయాలు'

ADB: జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం పుట్టిన పసి పాపపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. ఈ ఘటనలో పసి పాప తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం అదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.