జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై సమీక్ష
VSP: జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పబ్లిక్ వర్క్స్, మెకానికల్ పనులు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై చర్చించారు.