రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

KDP: ప్రకాశం జిల్లా సంజీవ రాయుని పేట వద్ద బుధవారం కలసపాడు మండలం పుల్లారెడ్డి పల్లెకు చెందిన గంగరాజు యాదవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వ్యక్తగత పనుల నిమిత్తం గిద్దలూరుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.