రుద్రారంలో పర్యటించిన అదనపు కలెక్టర్
MBNR: ఎస్.ఎస్.టి&ఎఫ్.ఎస్.టి పనితీరును రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం రాత్రి పరిశీలించారు. నవాబుపేట మండలం రుద్రారం గ్రామంలో ఆయన పర్యటించారు. ప్రతి గ్రామంలో కిరాణా దుకాణాలలో మద్యం అమ్మకాలపై దృష్టి సారించాలని అన్నారు. అలాగే నవాబుపేట మండలంలోని బార్డర్ చెక్ పోస్టును పరిశీలించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.