రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తనిఖీలు

రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తనిఖీలు

AKP: గొలుగొండ మండలం ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మంగళవారం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్సై రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో రికార్డులు లేని వాహనాలను స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దారి దోపిడీలు అరికట్టడానికి చర్యలు చేపట్టామన్నారు.