ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలి: కోదండరాం

ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలి: కోదండరాం

RR: ఫార్మాసిటీ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు తక్షణమే తగిన నష్టపరిహారం చెల్లించాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బాధితులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన బలవంతపు భూసేకరణ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.