21న సీఎం కప్ క్రీడా పోటీలు

21న సీఎం కప్ క్రీడా పోటీలు

SRCL: రాష్ట్ర క్రీడా సంస్థ ఆదేశాల మేరకు సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా 2024 ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున వాలీబాల్ క్రీడా పోటీలు ఈ నెల 21న సిరిసిల్ల మినీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వాలీబాల్ టీం పాల్గొంటారని జిల్లా యువజన క్రీడల శాఖ అదికారి రామదాసు తెలిపారు.