చెత్త సేకరణను పరిశీలించిన ఎంపీడీవో

చెత్త సేకరణను పరిశీలించిన ఎంపీడీవో

మన్యం: ప్రజలు కాలువలలో చెత్త వెయ్యకుండా చెత్త సేకరణ వ్యాన్ వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరువేరుగా వెయ్యాలని పాచిపెంట ఎంపీడీవో బివిజె పాత్రో తెలిపారు. శుక్రవారం పాచిపెంటలో చెత్త సేకరణను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇళ్లలో వినియోగించి మిగిలిన వ్యర్థాలు చెత్త బండిలో వేయాలన్నారు. సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రానికి తరలిస్తున్నామన్నారు.