రొంపిచర్లలో ఉచిత మెగా వైద్య శిబిరం
PLD: మండల కేంద్రమైన రొంపిచర్లలో ఆదివారం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కడియాల హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ యువనాయకుడు కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు.