VIDEO: ఎస్.కోటలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు
VZM: ఎస్.కోట మండలం వినాయక పల్లి, తలారి తదితర గ్రామాల్లో సోమవారం ఉదయం పొగ మంచు దట్టంగా కురిసింది. దీంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. గత రెండు రోజుల నుంచి మండలంలో ఉదయం వేళల్లో పొగ మంచు, సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ విభిన్న వాతావరణం నెలకొంది. ఈ తరహా వాతావరణంతో మామిడి, టమాటా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.