సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

MDK: చేగుంట మండలం ఉల్లి తిమ్మాయపల్లి గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ప్రారంభించారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో సీసీ రోడ్డుకు నిధులు మంజూరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, స్టాలిన్ నర్సింలు, రాజకుమార్ పాల్గొన్నారు.