కరెంటు వైర్లతో అప్రమత్తం ఉండాలి: సీపీ

KMM: గణపతి శోభాయాత్ర సమయంలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించే సమయంలో రోడ్లపై వేలాడే కరెంటు వైర్లతో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వైర్లను చేతితో తాకే ప్రయత్నం చేయవద్దని, అలాగే పోలీస్ అధికారులు సైతం వేలాడే కరెంటు వైర్లను విద్యుత్ అధికారులతో కలిసి విగ్రహాలు తరలించేవేళ ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.