నేడు ములుగులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

MLG: జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్య కర్తల సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతారని, జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.