కొత్త బార్లకు దరఖాస్తులు ప్రారంభం

AP: కొత్త బార్ పాలసీ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 840 బార్లు ఉన్నట్లు ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. వాటిలో 10శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించారు. రెస్టారెంట్ లైసెన్స్ నిబంధన సడలించారు. ఇకపై బార్ లైసెన్స్ ఫీజు 6 విడతల్లో చెల్లించవచ్చని అన్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 26వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 1నుంచి కొత్త బార్ పాలసీ అమలవుతుందని తెలిపారు.