ప్రత్యేక అలంకారంలో విరుపాక్షి మారెమ్మ
CTR:పుంగనూరు పట్టణం నడిబొడ్డున కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనం ఇచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి పసుపు, కుంకుమ, సింధూరం, గంధం మరియు వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.