'మున్సిపల్ ఫండ్స్‌ను సక్రమంగా వినియోగించాలి'
NZB: ఇటీవల విడుదలైన మున్సిపల్ ఫండ్స్‌ను అర్బన్ నియోజకవర్గంలో సక్రమంగా వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా నగరంలో వీధిదీపాలు వెలగడం లేదని వెంటనే మరమ్మతులు చేసి కొత్తలైట్లు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.