VIDEO: భగ్గు మంటున్న ఎండలు
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు దంచి కొడుతుండటంతో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భోరజ్ మండలం బాలాపూర్‌లో మంగళవారం 37 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అయితే, వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలలో మరింత పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.