ఏనుగు మలంతో కాఫీ.. టేస్ట్ అదిరిపోతుందట!
కాఫీల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్లాక్ ఐవరీ కాఫీ. దీని ధర సుమారు రూ.1,50,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. అయితే ఈ కాఫీని ఏనుగు మలంతో తయారు చేస్తారు. థాయ్ లాండ్‌లోని ఏనుగులకు అరబికా రకానికి చెందిన నాణ్యమైన కాఫీ పండ్లను తినిపిస్తారు. తర్వాత ఏనుగు విసర్జించిన మలం నుంచి ఈ కాఫీ గింజలను వేరు చేసి.. కడిగి ఎండబెడతారు. ఆ తర్వాత రోస్ట్ చేసి.. కాఫీలో వాడుతారు.