అదనపు ప్రభుత్వ న్యాయవాది నియామకం

అదనపు ప్రభుత్వ న్యాయవాది నియామకం

కృష్ణా: గుడివాడలో జిల్లా కోర్టు బెంచ్‌కు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడరుగా రెడ్డి బంగారయ్యను నియమిస్తూ న్యాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రభుత్వం తరపున సివిల్ కేసులు వాదిస్తారు. మూడు సంవత్సరాలు పాటు ఈయన పదవీకాలం కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.