చెరుకూరులో శనగ విత్తనాలు పంపిణీ
ప్రకాశం: పొన్నలూరు మండలం చెరుకూరులో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రాము మాట్లాడుతూ.. రైతులకు 25 శాతం రాయితీతో శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామని, విత్తనాలు కావాలనుకునే రైతులు ఆధార్ కార్డు, పొలం 1-బి, మొబైల్ నంబర్‌తో తమ సచివాలయ పరిధిలోని రైతుసేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని రాము సూచించారు.