మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు
GNTR: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు ఇతర వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులను బెదిరించారని, తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బీఎన్‌ఎస్ 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని ఆరోపించారు.