'కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం'
BDK: చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో BRS పార్టీ సీనియర్ నాయకులు యాదవ కమ్యూనిటీ నుంచి పలు కుటుంబాలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ చేరారు. వారిని ఎమ్మెల్యే జారే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.