VIDEO: రాయచోటిలో పోలీస్ యాక్ట్ 30 అమలు
అన్నమయ్య: రాయచోటి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నట్లు అర్బన్ సీఐ వెంకటాచలపతి తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ కృష్ణమోహన్ ఆదేశాల మేరకు కొత్తపల్లి ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. యువత గంజాయి, సొల్యూషన్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.