పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: సీపీఎం
GNTR: ప్రభుత్వ భూముల్లో 20 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గురువారం సీపీఎం పెదకాకాని మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. పెదకాకాని సుందరయ్య కాలనీలో గురువారం పేదలతో కలిసి సీపీఎం శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కల్పించాలన్నారు.