నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు
KMM: ఖమ్మం ప్రభుత్వ (విజయ) పాడి పరిశ్రమ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25 వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు. వివరాలకు 9959877109 సంప్రదించాలన్నారు.