హైకోర్టులో పవన్ కళ్యాణ్‌కు ఊరట

హైకోర్టులో పవన్ కళ్యాణ్‌కు ఊరట

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. రాజకీయ నాయకులు సినిమాల్లో నటించకూడదని దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. చట్ట ప్రకారం ప్రజాప్రతినిధులు సినిమాల్లో నటించకూడదనే నిషేధం ఏమీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పవన్ సినిమాలు చేయడానికి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దీనిపై జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.