జిల్లాలో మండలాల వారిగా పోలింగ్ వివరాలు
MLG: జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 13.31% ఓట్లింగ్ నమోదైంది. ఉదయం 9గం వరకు గోవిందరావుపేట మండలంలో 10.65%, ఏటూరునాగారం10.86, తాడ్వాయిలో 20.03% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు, అధికారులు పర్యటిస్తూ పోలింగ్ సరలిని పర్య వేక్షిస్తున్నారు.