నాటు సారా ఊట ధ్వంసం

నాటు సారా ఊట ధ్వంసం

అన్నమయ్య: సుండుపల్లె మండల పరిధిలోని కుప్పగుట్ట సమీపంలో బహుద నది ఒడ్డున 100 లీటర్ల నాటు సారా ఊటను ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు ధ్వంసం చేశారు. అక్కడ నాటు సారాను తయారు చేస్తున్న నాగలేశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.