'నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి'

NLG: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 20 క్రస్ట్ గేట్లను 5 అడుగులమేర ఎత్తి అధికారులు 1,55,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,46,180 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,88,388 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 586.90 అడుగులు, పూర్తి స్థాయి 590 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ 304.98 టీఎంసీలు, పూర్తి సామర్థ్యం 312.04 టీఏంసీలుగా ఉంది.