VIDEO: అరటి పంటకు తీవ్ర నష్టం

ప్రకాశం: కొమరోలు మండలంలోని ముక్తాపురం గ్రామంలో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు ఎకరాకు రూ.80,000 వరకు పెట్టుబడి పెట్టి, తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో ఈదురుగాలులతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు.