మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
కోనసీమ: సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మృత్యుంజయ హోమం నిర్వహించారు.