'విధి నిర్వహణలో అలసత్యం వహించవద్దు'
SRPT: పోలీసు అధికారులు విధి నిర్వహణలో అలసత్యం వహిస్తే సహించేది లేదని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్టేషన్‌ల వారీగా నమోదైన కేసులు, నిందితుల అరెస్టు, కేసు విచారణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.